‘బిగ్‌బాస్ 3’ లోకి సతీసమేతంగా హీరో వరుణ్ సందేశ్
- July 03, 2019విజయవంతంగా రెండు సీజన్లు ముగించుకుని మూడవ సీజన్లోకి అడుగుపెడుతున్న బిగ్‌బాస్.. హౌస్‌లోకి ఎవర్ని తీసుకురావాలనేదాని మీద పెద్ద కసరత్తే ప్రారంభించింది. తెరపై రోజుకో పేరు వినిపిస్తున్నా.. ఫైనల్‌గా ఎవరనేది చివరి వరకు సస్పెన్స్ మెయిన్‌టెయిన్ చేస్తోంది స్టార్ మా. మొన్నటి వరకు హోస్ట్ ఎవరనే దాని మీద చర్చలు నడిచాయి. ప్రోమోతో నవమన్మధుడు నాగార్జున అని కన్ఫామ్ అయింది. నవ్వించి, కవ్వించే నాగార్జున వస్తే ఇంటి సభ్యులకు బోల్డంత టైమ్‌పాస్. ఇక ఇంటి సభ్యులు.. హేమచంద్ర, ఉప్పల్ బాలు, ఉదయభాను, శ్రీముఖి, తీన్మార్ సావిత్రి ఇలా చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి. వీరితో పాటు తాజాగా తెరపైకి వచ్చిన జోడీ.. భార్యా భర్తలు అయిన హీరో వరుణ్ సందేశ్ ఆయన భార్య వితికా షెరు పేర్లు వినిపిస్తున్నాయి. ఇదే నిజమైతే బిగ్ బాస్ ప్రేక్షకులను మరింత ఆకట్టుకుంటుందని అంటున్నారు.
సాధారణంగా హౌస్‌లోకి ఎంటరయ్యే సభ్యులకు ఒకరి గురించి ఒకరికి అంతగా తెలియదు. అందుకే చాడీలు, అలకలు, గొడవలు.. నానా హంగామా చేస్తూ ప్రేక్షకులు హౌస్ గురించి, ఇంటి సభ్యుల గురించి మాట్లాడుకునేలా చేస్తుంటారు. ఒక్కోసారి విసుగుతెప్పించినా, మొత్తానికి హౌస్ వినోదాన్ని పంచేదిగా ఉంటుంది. ఇలాంటి ఇంట్లోకి భార్యభర్తలు అడుగుపెడితే ఎలా ఉంటుందో అనేది అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తుంది. హ్యాపీడేస్‌తో పరిచయమైన వరుణ్ సందేశ్.. దాదాపు 20 సినిమాల్లో చేశారు. ఈ మధ్య సినిమాలకు కాస్త దూరమైన వరుణ్ నువ్వు తోపురా సినిమాతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. 2015లో వితిక షెరును వివాహం చేసుకున్న వరుణ్ ఇప్పుడు బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంటరవుతున్నట్లు వార్తల సారాంశం. మరి ఇది ఎంతవరకు నిజమనేది తెలియాల్సి ఉంది.
తాజా వార్తలు
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- మరోసారి హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం..!
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్‌వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్‌లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం