ఇకపై మీ భాషలోనే బ్యాంకు పరీక్ష..
- July 04, 2019ఇంగ్లీష్ రాదు.. హిందీ అర్థం కాదు.. బ్యాంకు ఉద్యోగాలకు అప్లై చేద్దామంటే పరీక్షా పత్రం హిందీ, ఇంగ్లీషుల్లో ఉంటుందని చింతించాల్సిన అవసరం లేదు. ఇకపై బ్యాంకు ఉద్యోగాలకు సంబంధించిన పరీక్షలు ప్రాంతీయ భాషల్లో నిర్వహించనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో ప్రకటించారు. బ్యాంకు పరీక్షలను 13 ప్రాంతీయ భాషల్లో నిర్వహించనున్నట్లు ఆమె తెలిపారు. ప్రస్తుతం హిందీ, ఇంగ్లీషు భాషల్లోనే బ్యాంకు పరీక్షలు రాసే అవకాశం ఉంది. దీని వలన ప్రాంతీయ భాషల్లో చదువుకున్న వారికి పరీక్ష రాయడం కష్టంగా మారిందని ప్రభుత్వ దృష్టికి వచ్చింది. ఇంగ్లీషు భాషపై పట్టు తక్కువగా ఉండడంతో ప్రశ్నా పత్రం సరిగా అర్థం కాక కొందరు అభ్యర్థులు విఫలమవుతున్నారు. ముఖ్యంగా తెలుగు మీడియం నుంచి వచ్చిన వారికి మరింత ఇబ్బంది. తాజా నిర్ణయంతో ఈ అభ్యర్థులకు మేలు జరుగుతుంది.
తాజా వార్తలు
- HM సుల్తాన్ తో కువైట్ ఎమిర్ కీలక చర్చలు
- దోమలు ఎక్కువగా కనిపిస్తున్నాయా?
- అరబ్ సమ్మిట్.. ట్రాఫిక్ అడ్వైజరీ అలర్ట్ జారీ
- సౌదీ అరేబియాలో నర్సింగ్ సిబ్బందికి ఫుల్ డిమాండ్..!
- దుబాయ్ టూరిస్ట్ వీసా పొడిగింపు.. ఫీజులు, ప్రక్రియ
- PAM డైరెక్టర్ తో భారత రాయబారి సమావేశం
- కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- 110 రోజుల పాటు 200 విమానాల్లో ప్రయాణించి..పోలీసులకు చిక్కాడు..
- మోడీ మూడోసారి ప్రధాని కాబోతున్నారు: చంద్రబాబు
- ఢిల్లీ లోని నాలుగు ఆస్పత్రులకు బాంబు బెదిరింపులు