ఎన్ఆర్ఐలు ఎయిర్‌పోర్టులో దిగగానే ఆధార్ కార్డు..
- July 05, 2019
ఢిల్లీ:కేంద్ర బడ్జెట్‌లో ఎన్ఆర్‌ఐలపై ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ వరాలు కురిపించారు. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం... భారత పాస్ పోర్టు ఉన్న ఎన్‌ఆర్ఐలు స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత వారికి ఆధార్ కార్డు కావాలంటే కనీసం 180 రోజుల పాటు ఇండియాలో నివసించారు. అయితే, ఆ విధానంలో కేంద్రం మార్పులు తెచ్చింది. కొత్త రూల్స్ ప్రకారం ఎన్ఆర్‌ఐలు విమానాశ్రయంలో దిగిన వెంటనే ఆధార్ కార్డు తీసుకోవచ్చు. అంటే, వెంటనే ఆధార్ కార్డు వస్తుందన్నమాట. 180 రోజులు ఆగాల్సిన అవసరం లేదు. దీంతో విదేశాల్లోచాలా రోజులుగా ఉంటున్న ఎన్ఆర్ఐలకు లబ్ధి జరగనుంది. ఆధార్ కార్డుతో పాటు మరికొన్ని అంశాల్లో కూడా ఎన్‌ఆర్ఐలకు అనుకూలంగా కేంద్ర బడ్జెట్‌లో నిర్ణయాలు తీసుకున్నారు.
తాజా వార్తలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!







