ఈ ఫుడ్ మీ చర్మాన్ని మెరిపిస్తుంది..
- July 06, 2019ఆరోగ్యమైన, అందమైన చర్మాన్ని అందరూ కోరుకుంటారు. అందుకోసం ఏవేవో ప్రయత్నాలు చేస్తుంటారు. ఆర్టీఫీషియల్ మెరుపులు అద్దుతుంటారు. అలా కాకుండా ఆహారం విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మెరిసే చర్మం మీసొంతమవుతుంది. ఆ ఆహారపదార్థాలు ఏవో ఇప్పుడు చూద్దాం..
చేపలు, సోయా ఉత్పత్తులు.. ఇందులో ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల ఒత్తిడి, కుంగిబాటు, డిప్రెషన్ దూరమవుతాయి. ఈ కారణంగా చర్మం తాజాగా నిగనిగలాడుతుంటుంది.
బొప్పాయి.. విటమిన్ సి, ఇ బీటాకెరొటిన్ అధికంగా ఉండే వీటిని రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల చర్మంపైన ఉండే మృతకణాలు దూరమై అందంగా మారతారు.
క్యారెట్.. విటమిన్ ఎ అధికంగా ఉండే క్యారెట్స్ తినడం కళ్లు, చర్మానికి ఎంతో మంచిదని చెబుతున్నారు నిపుణులు. వీటిని తినడం వల్ల ఇన్ఫెక్షన్ల ప్రభావం అంతగా ఉండదని చెబుతున్నారు. వీటితో పాటు.. ఎర్ర క్యాప్సికమ్ కూడా మేలు చేస్తుందని.. ఇందులోని కెరొటినాయిడ్లు.. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. డార్క్ చాక్లెట్స్.. యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉండే ఈ చాక్లెట్స్.. చర్మాన్ని మృదువుగామారుస్తాయి. పాలకూర.. శరీరంలోని వ్యర్థాలను బయటకుపంపడంలో పాలకూర బాగాపనిచేస్తుంది. కాబట్టి.. వీటిని రెగ్యులర్‌గా తీసుకుని ఆరోగ్యవంతమైన చర్మాన్ని సొంతం చేసుకోవడమే కాకుండా.. ఆరోగ్యంగా ఉండమంటూ వైద్యులు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ కి పంపుతానని చెప్పి ఘరానా మోసం చేసిన ఏజెంట్
- ఏపీలో ఎన్నికల హింస పై 13 మందితో సిట్ ఏర్పాటు..
- అమ్మ ఆదర్శ పాఠశాల, వరి ధాన్యం కొనుగోళ్ల పై కీలక ఆదేశాలు జారీ
- ఖతార్‌లోని మ్యూజియమ్స్.. ఫ్రీ ఎంట్రీ
- చెక్స్ బౌన్స్. పరిహారంగా BD64,000
- 'అబ్షర్' ద్వారా యాక్సిడెంట్ రిపోర్టింగ్, వెహికల్ బదిలీ
- ఒమన్‌లో కొన్ని బ్యాంకు నోట్లు త్వరలోఉపసంహరణ..!
- ఆన్లైన్లో వస్తువులను విక్రయిస్తున్నారా? పోలీసుల హెచ్చరిక
- 1,300 కంపెనీలకు Dh100,000 జరిమానా..!
- IIT ఢిల్లీ–అబుధాబి.. ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల