ఉమ్‌ అల్‌ కువైన్‌లో రోడ్డు ప్రమాదం

- July 08, 2019 , by Maagulf
ఉమ్‌ అల్‌ కువైన్‌లో రోడ్డు ప్రమాదం

ఎమిరేటీ యువతి ఒకరు తన వాహనాన్ని నడుపుతూ అదుపు కోల్పోవడంతో వాహనం ఓ షాప్‌లోకి దూసుకుపోయింది. ఈ ఘటనలో ఆస్తి నష్టం సంభవించింది. విచారణలో వాహనాన్ని నడుపుతున్న యువతి, ఫోన్‌ మాట్లాడుతూ డ్రైవ్‌ చేసినట్లు గుర్తించారు అధికారులు. బ్రేయ్‌ వేయాల్సిన సమయంలో ఆమె గ్యాస్‌ పెడల్‌ని ప్రెస్‌ చేయడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు అధికారులు వివరించారు. సదరు యువతి వయసు 20 ఏళ్ళు అనీ, ఆమెకు ఈ ప్రమాదంలో ఎలాంటి గాయాలూ కాలేదని అధికారులు తెలిపారు. వాహనదారులు వాహనాల్ని నడిపే సమయంలో అప్రమత్తంగా వుండాలనీ, మొబైల్‌ ఫోన్‌ డ్రైవింగ్‌ ప్రమాదకరమని పోలీసు అధికారులు వాహనదారుల్ని హెచ్చరిస్తున్నారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com