15వ దలైలామాగా పుట్టపర్తి స్కూలు విద్యార్థి..

- July 09, 2019 , by Maagulf
15వ దలైలామాగా పుట్టపర్తి స్కూలు విద్యార్థి..

తన వారసుడు భారత్‌లోనే ఉన్నాడని 14వ దలైలామా గత మార్చిలో వ్యాఖ్యానించారు. ఆయన అన్నట్టుగానే అనంతపురం జిల్లా పుట్టపర్తి సత్యసాయి స్కూల్లో చదివే విద్యార్థి 15వ దలైలామాగా ఎంపికయ్యాడు. 7వ తరగతి చదువుతున్న దావావంగ్డిని పశ్చిమ బెంగాల్‌ డార్జిలింగ్‌కు చెందిన వాడు. తల్లిదండ్రులు ప్రేమవంగ్డి, పంజూరాయ్. ప్రస్తుత 14వ బౌద్ధగురువు దలైలామా దావావంగ్డిని వివిధ కోణాల్లో క్షుణ్ణంగా పరిశీలించి అతడిని ఎంపిక చేశారు. బాలుని తల్లిదండ్రులను ఒప్పించిన బౌద్ద గురువులు అతడిని తమతో పాటు తీసుకువెళ్లారు. మైసూరు సమీపంలోని బైలుగుప్పే (గోల్డెన్ టెంపుల్) బౌద్ధారామంలో 15 సంవత్సరాలు శిక్షణ ఇస్తారు. శిక్షణ పూర్తయ్యాక వంగ్డి దలైలామాగా బాధ్యతలు స్వీకరిస్తారు. తనను సాయిరాం అని పిలిస్తే పలుకుతానని వంగ్డీ స్నేహితులకు చెప్పి వీడ్కోలు తీసుకున్నాడు. దలైలామా అస్తమించిన తరువాత కూడా తిరిగి అంతకుముందున్న వారి ఆత్మలో ప్రవేశిస్తారని బౌద్ధుల నమ్మకం. కాగా, 15వ దలైలామా భారత్‌లో పుడతారని 14వ దలైలామా చెప్పిన వ్యాఖ్యలను చైనా తప్పుపడుతోంది. భారతీయులను కాకుండా వేరేవారిని నియమించాలనేది చైనా అభిప్రాయం. అయితే ఇప్పుడు నియమించిన 15వ దలైలామా దావావంగ్డి నియామకాన్ని చైనా ప్రభుత్వం అంగీకరించిందని ఆ దేశ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి గెంగ్ షువాంగ్ తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com