పొలిటికల్ ఇన్నింగ్స్ మొదలుపెట్టనున్న ధోనీ!
- July 13, 2019
ప్రపంచకప్‌లో భారత్ కథ సెమీస్‌తో ముగియడంతో ఇప్పుడు చర్చంతా సీనియర్ క్రికెటర్, మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని భవిష్యత్తపైనే జరుగుతోంది. ధోని రిటైర్మెంట్ తీసుకుంటాడనే ప్రచారం జోరందుకుంది. అయితే రిటైర్మెంట్ అనంతరం ధోని బీజేపీ పార్టీలో చేరుతాడని కేంద్ర మాజీమంత్రి, ఆ పార్టీ సీనియర్ నేత సంజయ్ పాస్వాన్ తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ధోని త్వరలోనే నరేంద్రమోదీ టీమ్‌లో పొలిటికల్ ఇన్నింగ్స్ ఆడే అవకాశం ఉందన్నారు.
ధోని బీజేపీలో చేరేలే ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. 'ధోని నా స్నేహితుడు. అతనొక ప్రపంచ దిగ్గజ ఆటగాడు. అతన్ని బీజేపీలోకి తీసుకువచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఈ విషయంపై చాలా రోజులుగా చర్చలు జరుపుతున్నారు. అయితే అతని రిటైర్మెంట్ అనంతరమే దీనిపై నిర్ణయం తీసుకోవచ్చు.' అని పాస్వాన్ పేర్కొన్నారు. ఇక ధోని సొంత రాష్ట్రమైన జార్ఖండ్‌లో ఈ ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ధోని బీజేపీలో చేరితే ఆ పార్టీ సీఎం అభ్యర్థిగా బరిలోకి దింపుతారనే ప్రచారం ఊపందుకుంది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..