4వ ఇంటర్నెట్‌ కాలింగ్‌ యాప్‌ని యూఏఈలో ప్రారంభించిన 'డు'

4వ ఇంటర్నెట్‌ కాలింగ్‌ యాప్‌ని యూఏఈలో ప్రారంభించిన 'డు'

యూఏఈ: 'డు' వినియోగదారులు, కొత్త యాప్‌ ద్వారా హై క్వాలిటీ వీడియో కాల్స్‌ని యూఏఈలో చేసుకునేందుకు అవకాశం కలుగుతోంది. వైజర్‌ చాట్‌ పేరుతో కొత్త యాప్‌, ఇప్పటికే అందుబాటులో వున్న మూడు యాప్‌లు బాటిమ్‌, సిమె మరియు హెచ్‌ఐయు మెసెంజర్‌లతోపాటుగా ఈ వీడియో కాలింగ్‌ సౌకర్యం కల్పిస్తోంది. నెట్‌వర్క్‌ ఇంటర్నెట్‌ కాలింగ్‌ ప్యాక్‌ సబ్‌స్క్రిప్షన్‌ ద్వారా ఈ యాప్‌ని వినియోగించుకోవచ్చు. సబ్‌స్క్రిప్షన్‌ ధర నెలకు 50 దిర్హామ్‌లు (మొబైల్‌ యూజర్స్‌కి). కాగా, హోమ్‌ యూజర్స్‌ ఇదే ప్యాకేజీ కోసం 100 దిర్హామ్‌లు నెలకు చెల్లించాల్సి వుంటుంది. డెయిలీ మొబైల్‌ ప్యాకేజీ పేరుతో రోజుకి 5 దిర్హామ్‌లు చెల్లించి ఇంటర్నెట్‌ కాలింగ్‌ కూడా పొందొచ్చు. అన్ని యాప్‌లూ ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ ప్లాట్‌ఫామ్స్‌పై అందుబాటులో వున్నాయి. 

 

Back to Top