సలాలాలో పర్యటించిన 70,000 మంది పర్యాటకులు
July 15, 2019
మస్కట్: జులై 14 వరకు సుమారు 70,000 మంది పర్యాటకులు సలాలాను సందర్శించినట్లు నేషనల్ సెంటర్ ఆఫ్ స్టాఇస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ వివరాలు వెల్లడిస్తున్నాయి. ఖరీఫ్ టూరిస్ట్ సీజన్‌లో భాగంగా సందర్శించిన సందర్శకుల లెక్క ఇది. 68,165 మంది పర్యాటకుల్లో 34,600 మంది ఒమనీయులు కావడం గమనార్హం. సౌదీ అరేబియా నుంచి 1,105 మంది, యూఏఈ జాతీయులు 4,670 మంది సలాలాను సందర్శించడం జరిగింది. 617 మందియూరోపియన్ విజిటర్స్ కూడా సలాలాకు వచ్చారు. ఆసియా జాతీయుల లెక్క తీస్తే, సలాలాను సందర్శించినవారిలో 9,486 మంది వున్నట్లు తేలింది.