దుబాయ్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో విద్యుత్‌ సమస్య

దుబాయ్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో విద్యుత్‌ సమస్య

దుబాయ్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ పోర్ట్‌కి చెందిన మూడో టెర్మినల్‌లో 30 నిమిషాల పాటు విద్యుత్‌ సమస్య తలెత్తింది. అయితే, ఈ సమస్య కారణంగా ఎయిర్‌పోర్ట్‌ ఆపరేషన్‌కి ఎలాంటి సమస్యలూ రాలేదు. ఉదయం 11.04 నిమిషాల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సాంకేతిక సమస్య కారణంగానే ఇలా జరిగిందని దుబాయ్‌ ఎయిర్‌పోర్ట్స్‌ అధికార ప్రతినిథి వెల్లడించారు. 30 నిమిషాల్లోనే సమస్యను సరిదిద్దామని చెప్పారు. అయితే, ఏసీ యూనిట్స్‌ షట్‌ డౌన్‌ అవడంతో పలువురు ప్రయాణీకులు తీవ్ర సమస్యల్ని ఎదుర్కొన్నారు. 1960లో దుబాయ్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ అందుబాటులోకి వచ్చింది. సుమారు 88.2 మిలియన్‌ ప్రయాణీకులు ఏడాదిలో ఈ విమానాశ్రయం నుంచి ప్రయాణిస్తుంటారు. 100 ఎయిర్‌ లైన్స్‌ ప్రపంచ వ్యాప్తంగా 240 డెస్టినేషన్స్‌కి తమ సేవల్ని అందిస్తున్నాయి. 

Back to Top