రినైస్సాన్స్‌ డే: ఒమన్‌ నేషనల్‌ మ్యూజియంలోకి ఉచిత ప్రవేశం

రినైస్సాన్స్‌ డే: ఒమన్‌ నేషనల్‌ మ్యూజియంలోకి ఉచిత ప్రవేశం

మస్కట్‌: జులై 23న రినైస్సాన్స్‌ డేని పురస్కరించుకుని ఒమన్‌ నేషనల్‌ మ్యూజియంలోకి పెద్దలకు ఉచిత ప్రవేశం కల్పించనున్నారు. ప్రతి ఏడాదీ ఒమన్‌ మరియు గల్ఫ్‌ దేశాల్లో నివసిస్తున్న అడల్ట్‌ విజిటర్స్‌కి రినైస్సాన్స్‌ డే రోజున నేషనల్‌ మ్యూజియంలోకి ఉచిత ప్రవేశం కల్పిస్తూ వస్తున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నేషనల్‌ మ్యూజియం తెరచి వుంటుంది. శుక్రవారాల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే తెరచి వుంటుంది ఒమన్‌ నేషనల్‌ మ్యూజియం. సిటిజన్స్‌ అలాగే జిసిసి జాతీయులకు 1 ఒమన్‌ రియాల్స్‌, ఒమన్‌లోని నివాసితులకు 2 ఒమన్‌ రియాల్స్‌, టూరిస్టులకు 5 ఒమన్‌ రియాల్స్‌ రుసుముతో ఒమన్‌ నేషనల్‌ మ్యూజియంలోకి ప్రవేశం వుంటుంది. జనరల్‌ టూర్స్‌ కోసం 10 ఒమన్‌ రియాల్స్‌ గ్రూప్‌కి చెల్లించాల్సి వుంటుంది.. ఇది ఎంట్రన్స్‌ ఫీజులకు అదనం.  

Back to Top