భర్తనీ, పిల్లల్ని స్పాన్సర్‌ చేసే అవకాశం మహిళకు వుందా?

భర్తనీ, పిల్లల్ని స్పాన్సర్‌ చేసే అవకాశం మహిళకు వుందా?

ఫార్మసిస్ట్‌గా పనిచేస్తోన్న తన భార్య తనను తన పిల్లల్ని స్పాన్సర్‌ చేసే అవకాశం వుందా.? అన్న ప్రశ్నకు 'ఔను' అని సమాధానమిస్తున్నారు దుబాయ్‌, యూకే, సింగపూర్‌ మరియు భారత్‌లలో క్వాలిఫైడ్‌ లా ప్రాక్టీసర్‌ అయిన ఆశిష్‌ మెహతా. ఆశిష్‌ మెహమతా అండ అసోసియేట్స్‌ మేనేజింగ్‌ పార్టనర్‌ మరియు ఫౌండర్‌ అయిన ఆశిష్‌, మహిళా స్పాన్సరర్‌కి సంబంధించి ఆసక్తికరమైన వివరణ ఇచ్చారు. మెడికల్‌ సెక్టార్‌లో టీచర్‌ లేదా ఇతర ఏ ఉద్యోగం అయినా చేస్తూ నెలకి 3,000 బేసిక్‌ సేలరీ ప్లస్‌ అకామడేషన్‌ సంపాదిస్తోంటే లేదా అకామడేషన్‌తో సంబంధం లేకుండా నెలకి 4,000 దిర్హామ్‌లు సంపాదిస్తోంటే ఆమె తన భర్తకూ, అలాగే తన పిల్లలకూ స్పాన్సర్‌ చేయవచ్చునని తెలిపారు. అయితే, ఈ విషయమై డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెసిడెన్సీ మరియు ఫారినర్స్‌ ఎఫైర్స్‌తో సంప్రదించి మరిన్ని అనుమానాలకు నివృత్తి పొందవచ్చునని ఆయన వివరించారు. 

 

Back to Top