పక్కలో ఉన్న ఫోన్ పేలడంతో 11 ఏళ్ల చిన్నారి..
- July 16, 2019
ఫోన్‌తో ఆటలు.. వేడెక్కిందాకా మాటలు.. పక్కనే పెట్టుకుని నిద్రపోవడం.. ఛార్జింగ్ పెట్టి మాట్లాడడం.. ఇవన్నీ ప్రమాదానికి దారి తీసే అంశాలే. ఒక్కోసారి టైమ్ బావుండకపోతే జేబులో పెట్టుకున్న ఫోన్ కూడా పేలిపోతుంటుంది. లోకల్ మేడ్ ఫోన్లు, తక్కువ ఖరీదు పెట్టి కొన్న ఫోన్లు కాదండోయ్ పేలేది.. ఆపిల్ ఐఫోన్లు కూడా పేలిపోతున్నాయి. మరి దీనికి కారణాలు ఏమైఉంటాయో కంపెనీ వివరించాల్సి ఉంది. అమెరికాకు చెందిన 11ఏళ్ల చిన్నారి అప్పటి వరకు ఫోన్‌తో ఆడి పక్కనే పెట్టుకుని నిద్రపోయింది. చిన్నారి గాఢ నిద్రలో ఉండగా ఒక్కసారిగా ఫోన్ నుంచి దట్టమైన పొగలు వచ్చాయి. ఏదో కాలుతున్న వాసన వచ్చి వెంటనే దుప్పటి తొలగించి దూరంగా విసిరేసింది. దానితో పాటే ఫోన్ కూడా పడిపోయి పెద్ధ శబ్ధంతో పేలి పోయింది. ఆపిల్ ఐఫోన్ 6 చూస్తుండగానే కాలి బూడిద అయింది. అదృష్టవశాత్తు పాపకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. చిన్నారి తల్లి మారియా అడేటా వెంటనే ఆపిల్ సపోర్టుకు కాల్ చేసి కంప్లైంట్ చేసింది. దానికి కంపెనీ బాధ్యత వహిస్తూ ఫోన్ పేలడానికి గల కారణాలను విచారిస్తామని వెల్లడించింది. ఈ ప్రమాదంలో పాపకు ఏమీ కాలేదని తల్లి సంతోషంతో ఊపిరి పీల్చుకుంది.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!