అంతర్జాతీయ యోగా ట్రైనర్స్‌గా తెలంగాణ అమ్మాయిలు

అంతర్జాతీయ యోగా ట్రైనర్స్‌గా తెలంగాణ అమ్మాయిలు

తెలంగాణ యెంగెస్ట్ సిస్టర్స్ …అతి పిన్న వయస్సులోనే అంతర్జాతీయ యోగా ట్రైనర్స్‌గా గుర్తింపు పొందారు. హైదరాబాద్ సోమాజీగూడలోని భోధి యోగా సెంటర్‌లో నాలుగు సంవత్సరాల పాటు శిక్షణ పొందిన వైష్ణవి,శ్వేతలు యోగా ట్రైనర్స్‌గా సర్టిఫికేట్లు అందుకున్నారు. దేశంలోనే ఫస్ట్ టైం అతి పిన్న వయస్సుగల ఇంటర్నేషనల్ యోగా ట్రైనర్స్‌గా తెలంగాణ అమ్మాయిలు గుర్తింపు పొందడం సంతోషంగా ఉందని భోదియోగా చీఫ్ ట్రైనర్ అశోక్ తెలిపారు .ఏటేటా యోగా చేసే వారి సంఖ్య పెరుగుతుందని…ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల శ్రద్ద చూపిస్తున్నారని ఆయన తెలిపారు .అనంతరం యోగా సిస్టర్స్ పలు యోగాసనాలు చేసి అందరినీ ఆకట్టుకున్నారు.

Back to Top