పక్కలో ఉన్న ఫోన్ పేలడంతో 11 ఏళ్ల చిన్నారి..
- July 16, 2019ఫోన్‌తో ఆటలు.. వేడెక్కిందాకా మాటలు.. పక్కనే పెట్టుకుని నిద్రపోవడం.. ఛార్జింగ్ పెట్టి మాట్లాడడం.. ఇవన్నీ ప్రమాదానికి దారి తీసే అంశాలే. ఒక్కోసారి టైమ్ బావుండకపోతే జేబులో పెట్టుకున్న ఫోన్ కూడా పేలిపోతుంటుంది. లోకల్ మేడ్ ఫోన్లు, తక్కువ ఖరీదు పెట్టి కొన్న ఫోన్లు కాదండోయ్ పేలేది.. ఆపిల్ ఐఫోన్లు కూడా పేలిపోతున్నాయి. మరి దీనికి కారణాలు ఏమైఉంటాయో కంపెనీ వివరించాల్సి ఉంది. అమెరికాకు చెందిన 11ఏళ్ల చిన్నారి అప్పటి వరకు ఫోన్‌తో ఆడి పక్కనే పెట్టుకుని నిద్రపోయింది. చిన్నారి గాఢ నిద్రలో ఉండగా ఒక్కసారిగా ఫోన్ నుంచి దట్టమైన పొగలు వచ్చాయి. ఏదో కాలుతున్న వాసన వచ్చి వెంటనే దుప్పటి తొలగించి దూరంగా విసిరేసింది. దానితో పాటే ఫోన్ కూడా పడిపోయి పెద్ధ శబ్ధంతో పేలి పోయింది. ఆపిల్ ఐఫోన్ 6 చూస్తుండగానే కాలి బూడిద అయింది. అదృష్టవశాత్తు పాపకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. చిన్నారి తల్లి మారియా అడేటా వెంటనే ఆపిల్ సపోర్టుకు కాల్ చేసి కంప్లైంట్ చేసింది. దానికి కంపెనీ బాధ్యత వహిస్తూ ఫోన్ పేలడానికి గల కారణాలను విచారిస్తామని వెల్లడించింది. ఈ ప్రమాదంలో పాపకు ఏమీ కాలేదని తల్లి సంతోషంతో ఊపిరి పీల్చుకుంది.
తాజా వార్తలు
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌కు సయ్యద్ థెయాజిన్
- హోలోగ్రామ్‌లుగా యూఏఈ ల్యాండ్‌మార్క్‌లు..!
- బహ్రెయిన్ లో వారంపాటు 'అస్థిర' వాతావరణం..!
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్‌లో నిందితుడి అరెస్ట్