అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పు పై ఆధారబడ్డ కుల్‌భూషణ్ భవితవ్యం
- July 17, 2019
గూఢచర్యం ఆరోపణలు ఎదుర్కొంటున్న భారతీయుడు కుల్‌భూషణ్ జాదవ్ భవితవ్యం ఇవాళే తేలనుంది. జాదవ్ కేసులో ఇవాళ అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పు వెలువరించనుంది. కుల్‌భూషణ్ జాదవ్ తమ దేశంలో గూఢచర్యం చేస్తుంటే పట్టుకున్నామని పాకిస్థాన్ వాదిస్తోన్న అంతకు ముందే తమ దేశ ఆర్మీ కోర్టులో జాదవ్‌కు ఉరిశిక్ష ఖరారు చేసింది. అయితే, జాదవ్ దుబాయ్‌లో ఉండగా అరెస్ట్ చేసి పోలీసులు పాకిస్థాన్‌కు తీసుకెళ్లారని ఆయన కుటుంసభ్యులు వాదిస్తున్నారు. ఇక, పాక్ కోర్టులో జాదవ్‌కు ఉరిశిక్ష విధించడాన్ని సవాల్ చేస్తూ అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది భారత్. ఈ కేసులో జాదవ్ నేరం చేశాడని పాకిస్థాన్ న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను అంతర్జాతయ కోర్టు తప్పుబట్టింది. భారత్ తరపున ప్రముఖ న్యాయవాది హరీష్‌సాల్వే వాదించారు. జాదవ్‌ను నిర్ధోషిగా విడిపిస్తారా? లేక పాకిస్థాన్ తీర్పును ఖరారు చేస్తారా? అనే విషయం ఇవాళ తేలనుంది. ఈ కేసులో తమకు అనుకూలంగానే తీర్పు వస్తుందని భారత్ భావిస్తోంది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..