చంద్రయాన్-2 రీలాంచ్ డేట్ ఫిక్స్
- July 17, 2019ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్ 2 రీలాంచ్ డేట్ దాదాపు ఖరారు చేశారు. జులై 21 అర్ధరాత్రి ప్రయోగం ఉంటుందని ఇస్రో వర్గాలంటున్నాయి. దీనికి సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. కొద్ది గంటల్లో కౌంట్ డౌన్ ఉంటుందని భావిస్తున్నారు.
వాస్తవానికి చంద్రయాన్ 2 ఈ నెల 15 అర్దరాత్రి ప్రయోగించాల్సి ఉంది. కౌంట్‌డౌన్ కూడా మొదలైంది. కానీ ప్రయోగానికి గంట ముందు లూనార్ మిషన్ లో సాంకేతిక సమస్య తలెత్తడంతో ప్రయోగాన్ని ఆపేశారు. కాసేపట్లో నింగికి ఎగుస్తుందని ఎదురుచూస్తున్న సమయంలో ప్రయోగం ఆగిపోవడం కాస్త నిరాశపరిచింది. అయితే సాంకేతిక సమస్యలు సరిదిద్దామని… జులై21 అర్ధరాత్రి ప్రయోగానికి సిద్దం చేసినట్టు తెలిపారు.
తాజా వార్తలు
- షేక్ తహ్నౌన్ మరణంపై అమీర్ సంతాపం
- బీచ్‌లు, పబ్లిక్ పార్కులు, మార్కెట్లు మూసివేత
- కువైట్‌లో కోవిడ్-19 వ్యాక్సిన్ల దుష్ప్రభావాలు లేవు..!
- కోవిడ్ సర్టిఫికేట్ నుంచి ప్రధాని మోడీ ఫొటో తొలగింపు
- అమిత్ షా మార్ఫింగ్ వీడియో కేసులో ముగ్గురు అరెస్ట్
- తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
- పోలింగ్ సమయాన్ని పెంచిన కేంద్ర ఎన్నికల సంఘం
- తెలంగాణలో ఎన్నికల ప్రచారంకు రాహుల్, ప్రియాంక..
- ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్..!
- ప్రయాణికులకు దుబాయ్ ఎయిర్‌పోర్ట్స్, విమానయాన సంస్థలు కీలక సూచనలు..!