హజ్‌ యాత్రీకులకు 8 మిలియన్‌ హోలీ ఖురాన్‌ల పంపిణీ

- July 18, 2019 , by Maagulf
హజ్‌ యాత్రీకులకు 8 మిలియన్‌ హోలీ ఖురాన్‌ల పంపిణీ

రియాద్‌: మినిస్ట్రీ ఆఫ్‌ ఇస్లామిక్‌ ఎఫైర్స్‌, దావాహ్‌ మరియు గైడెన్స్‌, హజ్‌ సీజన్‌ సందర్భంగా బుక్‌ డిస్ట్రిబ్యూషన్‌ ప్రోగ్రామ్‌ కోసం ఏర్పాట్లు ముమ్మరం చేసింది. పవిత్ర స్థలాల్ని దర్శించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించేవారికి ఈ ఖురాన్‌ బుక్స్‌ని అందజేయనున్నారు. 52 పుస్తకాల్ని 30కి పైగా భాషల్లో ఇప్పటికే ఆమోదించడం జరిగిందని డిపార్ట్‌మెంట్‌ ఫ్‌ పబ్లికేషన్స్‌ ఎఫైర్స్‌ అండ్‌ స్కాలర్లీ రీసెర్చ్‌ అండర్‌ సెక్రెటరీ షేక్‌ అబ్దుల్‌ అజీజ్‌ బిన్‌ మొహమ్మద్‌ అల్‌ హమ్దాన్‌ చెప్పారు. 8 మిలియన్లకు పైగా పవిత్ర ఖురాన్‌ కాపీలు, రిట్యువల్‌ బుక్స్‌ మరియు మాన్యువల్స్‌ని యాత్రీకులకు పంపిస్తారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com