తానే ప్రిన్సెస్ డయానా అంటున్న బుడతడు!
- July 19, 2019
బ్రిటన్ యువరాణి ప్రిన్సెస్ డయానా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమె అందానికి ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ మగ్ధులైపోయారు. అలాంటి అందాలరాణి ఓ రోడ్డు ప్రమాదంలో మరణించింది. ఈ మృతిపై అనేక సందేహాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రిన్సెస్ డయానా మళ్లీ పుట్టింది. మళ్లీ పుట్టడమా.. అదేంటి అన్నదే కదా మీ సందేహం. అవునండి.. గత జన్మలో తానే ప్రిన్సెస్ డయానా అంటున్నాడు ఆస్ట్రేలియాలికు చెందిన ఓ బాలుడు. అతని పేరు బిల్లీ కాంప్‌బెల్.
ప్రిన్సెస్ డయానా 1997లో ఓ కారు ప్రమాదంలో చనిపోగా.. ఆ తర్వాత 18 ఏండ్లకు బిల్లీ పుట్టాడు. రెండేండ్ల వయసులో ఉన్నప్పుడు డయానా ఫోటోను చూసిన బిల్లీ అది తానేనని చెప్పాడని డేవిడ్ తెలిపారు. డయానా కొడుకులైన ప్రిన్స్ విలియం, హ్యారీల విషయాలు.. జన్మించిన కొద్ది గంటలకే చనిపోయిన డయానా సోదరుడు జాన్ గురించి కూడా బిల్లీ చెప్పాడని డేవిడ్ అన్నారు.
అసలు బిల్లీ కాంప్‌బెల్ ఎవరో తెలుసా? ఓ టీవీ యాంకర్ కుమారుడు. గత జన్మలో తాను ప్రిన్సెస్ డయానా అనీ, అప్పటి విషయాలు కూడా తనకు గుర్తున్నాయని ప్రకటించుకుంటున్నా డు. ఆమె వ్యక్తిగత, కుటుంబానికి సంబంధించిన పలు విశేషాలను కూడా పంచుకుంటున్నాడు. పైగా, ప్రిన్సెస్ డయానా పిల్లలైన విలియమ్, హ్యారీలు తన పిల్లలేనని అంటున్నారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!