ఐఎంఎ జ్యువల్స్ యజమాని మహ్మద్ మన్సూర్ ఖాన్‌ను అరెస్టు చేసిన ED
- July 20, 2019
బెంగళూరు: వేల కోట్ల కుంభకోణంలో ప్రధాన నిందితుడైన ఐఎంఏ జ్యువెల్లరీ యజమాని మహమ్మద్ మన్సూర్ ఖాన్ అరెస్టయ్యారు. దుబాయ్ నుంచి శుక్రవారం తెల్లవారుజామున ఢిల్లీకి చేరుకున్న ఆయనను ఎయిర్‌పోర్టులోనే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేసినట్లు సిట్ పోలీసు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఖాన్‌ను ఢిల్లీలోనే ఈడీ విచారిస్తోంది. దుబాయ్‌లో తలదాచుకున్న మన్సూర్ భారత్‌కి వచ్చి, కోర్టులో లొంగిపోవడానికి దర్యాప్తు సంస్థలు ఒప్పించినట్లు సిట్ అధికారులు తెలిపారు. అధిక వడ్డీలు ఇస్తామనీ, తమ కంపెన్లీలో పెట్టుబడులు పెట్టాలంటూ ఐఎంఏ గ్రూప్ ద్వారా దాదాపు లక్ష మంది నుంచి మొత్తంగా రూ. 4,084 కోట్లను మన్సూర్ వసూలు చేశాడు. తర్వాత తాను తీవ్రంగా నష్టపోయాననీ, ఆత్మహత్యే శరణ్యమని ఒక ఆడియో టేప్‌ను జూన్ మొదటివారంలో విడుదల చేసి అదృశ్యమయ్యారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..