అమెరికా టూర్లో ఇమ్రాన్‌ఖాన్‌కు అడుగడుగునా అవమానాలు
- July 22, 2019అమెరికా పర్యటనలో పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు అడుగడుగునా అవమానాలే ఎదురవుతున్నాయి. ఎయిర్ పోర్టులో అధికారిక స్వాగతం పలికేందుకు అమెరికా అధికారులెవరూ రాలేదు. కనీస ప్రొటోకాల్ ను కూడా పాటించలేదు. అమెరికాలోని పాకిస్థాన్ అంబాసిడర్ మాత్రమే ఎయిర్ పోర్టుకు వచ్చారు. చివరికి ఆయనతో పాటే వెళ్లిపోయిన ఇమ్రాన్ ఖాన్ అతడి ఇంట్లోనే బస చేయాల్సి వచ్చింది. US ప్రభుత్వం ఎలాంటి వాహనాలు కూడా సమకూర్చలేదు. దీంతో ఎయిర్ పోర్టు నుంచి పాక్ అంబాసిడర్ ఇంటికి మెట్రోలో వెళ్లారు ఇమ్రాన్. ఈ ఘోర అవమానాలను తట్టుకుని ఆయన అమెరికా అధినేత ట్రంప్ ను కలవనున్నారు. అసలే పాక్ తీరుపై రుసరుసలాడుతోన్న ట్రంప్ ఎలా స్పందిస్తారో..!
ఈ పర్యటన కోసం శనివారమే అమెరికా చేరుకున్నారు ఇమ్రాన్ ఖాన్. ఆయన టూర్ ని వ్యతిరేకిస్తూ యూఎస్ లోని పలుప్రాంతాల్లో నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. వాషింగ్టన్ లో MQM ప్రతినిధులు ఇమ్రాన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అటు అమెరికాలోని పాక్ జాతీయులను ఉద్దేశిస్తూ ఇమ్రాన్ ప్రసంగిస్తున్న సభలోనూ కలకలం రేగింది. బలూచిస్తాన్ మద్దతుదారులు పాకిస్థాన్ కు వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్‌లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..