సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనూహ్య హత్య కేసులో దోషి తన శిక్షపై అపీల్
- January 06, 2016
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మచిలీపట్నం సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనూహ్య రేప్, హత్య కేసులో దోషిగా తేలి మరణశిక్ష పడిన టాక్సీ డ్రైవ్ర చంద్రబాన్ సనప్ తనకు విధించిన శిక్షపై అపీల్ చేసుకున్నాడు. అపీల్ను బొంబై హైకోర్టు మంగళవారం విచారణకు స్వీకరించింది. తనకు విధించిన మరణశిక్షను అతను హైకోర్టులో సవాల్ చేశాడు. ముంబైలోని ఛత్రపతి శివాజీ టెర్మినల్లో దిగిన టిసిఎస్ సాఫ్ట్వేర్ ఉద్యోగిని అయిన ఈస్టర్ అనూహ్యను అంధేరిలోని హాస్టల్లో దింపుతానని చెప్పి చంద్రబాన్ సనప్ తన వెంట తీసుకుని వెళ్లి అత్యాచారం చేసి, ఆ తర్వాత ఆమెను చంపేసినట్లు నిర్ధారణ కావడంతో ప్రత్యేక కోర్టు అతనికి నిరుడు మరణశిక్ష విధించింది. అనూహ్య కేసులో సనప్ను దోషిగా నిర్ధారిస్తూ ప్రత్యేక కోర్టు నిరుడు అక్టోబర్ 30వ తేదీన తీర్పు చెప్పింది. ట్రయల్ కోర్టు దీన్ని అరుదైన కేసుల్లో అరుదైన కేసుగా పరిగణించింది. మచిలీపట్నం నుంచి బయలుదేరిన అనూహ్య నిరుడు జనవరి 5వ తేదీన ముంబై చేరుకని సనప్ బారిన పడింది. తీవ్రమైన గాలింపు తర్వాత అనూహ్య మృతదేహాన్ని కుటుంబ సభ్యులు జనవరి 16వ తేదీన పొదల్లో కనిపించింది. మార్చిలో సనప్ను పోలీసులు అరెస్టు చేశారు. సనప్కు విధించిన మరణశిక్ష ధ్రువీకరణకు రాష్ట్ర ప్రభుత్వం కూడా పిటిషన్ దాఖలు చేసింది. సనప్ పిటిషన్తో పాటు ఈ పిటిషన్ కూడా విచారణకు రానుంది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







