ప్రముఖ వ్యాపారవేత్త లక్ష్మీ నివాస్‌ మిత్తల్‌ సోదరుడు అరెస్ట్

- July 24, 2019 , by Maagulf
ప్రముఖ వ్యాపారవేత్త లక్ష్మీ నివాస్‌ మిత్తల్‌ సోదరుడు అరెస్ట్

బోస్నియా: ప్రముఖ వ్యాపారవేత్త లక్ష్మీ నివాస్‌ మిత్తల్‌ సోదరుడు ప్రమోద్‌ మిత్తల్‌ను ఆర్థిక నేరాలు, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్న అభియోగాల కింద ఐరోపాలోని బోస్నియా అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఆరోపణలు నిజమని తేలితే అక్కడి చట్టాల ప్రకారం దాదాపు 45సంవత్సరాల జైలు శిక్ష పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. బోస్నియాలో అత్యంత పెద్ద ఎగుమతిదారుగా ఉన్న జీఐకేఐఎల్‌ కంపెనీకి ప్రమోద్‌ చీఫ్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రమోద్‌తో పాటు కంపెనీ జనరల్‌ మేనేజర్‌ పరమేశ్ భట్టాచార్య, బోర్డు సభ్యుడు రజీబ్‌ డాశ్‌ను సైతం అదుపులోకి తీసుకున్నట్లు అక్కడి ఓ ఉన్నతాధికారి స్థానిక మీడియాకు తెలిపారు. ప్రస్తుతం కంపెనీలో సోదాలు నిర్వహిస్తున్న పోలీసులు ఆధారాలతో సహా వారిని బుధవారం కోర్టు ముందు హాజరుపరిచే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com