పాస్‌పోర్ట్‌ చూపే పని లేకుండా 20,000 మంది ట్రావెలింగ్‌

- July 24, 2019 , by Maagulf
పాస్‌పోర్ట్‌ చూపే పని లేకుండా 20,000 మంది ట్రావెలింగ్‌

దుబాయ్: దుబాయ్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి పాస్‌పోర్ట్‌ చూపే పని లేకుండా సుమారు 20,000 మంది ప్రయాణీకులు ఇప్పటికే ప్రయాణం చేశారు. స్మార్ట్‌ టన్నెల్‌ ద్వారా ఇది సాధ్యమయ్యింది. గత ఏడాది అక్టోబర్‌లో ఈ స్మార్ట్‌ టన్నెల్‌ని ప్రారంభించారు. బిజినెస్‌ మరియు ఫస్ట్‌ క్లాస్‌ ట్రావెలర్స్‌కి మాత్రమే టెర్మినల్‌ 3 వద్ద అందుబాటులో వుంది ఈ హైటెక్‌ సర్వీస్‌. సింగిల్‌ స్టెప్‌లో సీమ్‌లెస్‌ ఇమ్మిగ్రేషన్‌ క్లియరెన్స్‌ ఈ టెక్నాలజీ సొంతం. ఫింగర్‌ ప్రింట్‌తో కూడా అవసరం లేదిక్కడ. ప్రయాణీకులు స్మార్ట్‌ టన్నెల్‌లో ఏర్పాటు చేసిన బయోమెట్రిక్‌ రికగ్నిషన్‌ టెక్నాలజీ కెమెరా వైపు చూస్తే సరిపోతుంది. అక్కడ క్లియరెన్స్‌ వస్తే, ప్యాసింజర్స్‌, తమ పాస్‌పోర్ట్‌పై స్టాంపింగ్‌తో పనిలేకుండానే ప్రయాణించడానికి వీలుంది. మొత్తంగా మూడు నుంచి నాలుగు సెకెండ్ల పాటు మాత్రమే ఈ ప్రక్రియ నడుస్తుంది. స్మార్ట్‌ న్నెల్‌ని ఏర్పాటు చేసిన తొలి నగరంగా దుబాయ్‌ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com