బందరు పోర్టు తెలంగాణకు అమ్మడం లేదు--మేకపాటి గౌతమ్ రెడ్డి

- July 26, 2019 , by Maagulf
బందరు పోర్టు తెలంగాణకు అమ్మడం లేదు--మేకపాటి గౌతమ్ రెడ్డి

అమరావతి:బందరు పోర్టును ఐదేళ్లలో పూర్తి చేస్తామని, తెలంగాణ రాష్ట్రానికి అమ్ముకుంటామనేది వాస్తవం కాదన్నారు మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు నిజం కాదని..ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్‌కు జరగాలంటే..కేంద్రం అనుమతి ఉండాలని తెలిపారు. సీఎం జగన్‌తో చర్చించి పోర్టుపై ఒక నిర్ణయానికి వస్తామని సభకు తెలిపారు.

2019, జులై 26వ తేదీ శుక్రవారం ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో తొలుత ప్రశ్నోత్తరాలను చేపట్టారు స్పీకర్. బందరు పోర్టుపై సభ్యులు ప్రశ్నలు అడిగారు. దీనికి మంత్రి సమాధానం ఇచ్చారు. ప్రైవేటు డెవలపర్ చేయకపోతే..ప్రభుత్వమే దీనిని నిర్వహిస్తామని మంత్రి మేకపాటి తెలిపారు. 

అంతకు ముందు పలువురు సభ్యులు దీనిపై మాట్లాడారు. ఈ పోర్టును ప్రభుత్వమే నిర్మించాలని ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. బాబు హయాంలో అవసరానికి మించి భూ సేకరణ చేశారని, మొత్తం 4వేల ఎకరాల భూ సేకరణ చేసినట్లు చెప్పారు. రూ. 10 కోట్లతో శంకుస్థాపనతో చేశారని సభలో వెల్లడించారు. బందరు పోర్టుకు దశబ్దాల చరిత్ర ఉందని..ఈ పోర్టుపై టీడీపీ ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదన్నారు ఎమ్మెల్యే జోగి రమేష్ రాష్ట్రంలో ఎక్కడ చూసినా భూ సేకరణ చేయాలని అనుకున్నారని..బలవంతంగా భూ సేకరణ చేయాలని బాబు చూశారని తెలిపారు. భూ సేకరణ నోటిఫికేషన్‌ను ఎప్పుడు రద్దు చేస్తారని సభలో ప్రశ్నించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com