ఇరాన్:అదుపులో ఉన్న 9మంది నావికుల విడుదల!
- July 26, 2019
ఇరాన్:ఇరాన్ ఎమ్‌టీ రియా అనే నావను అదుపులోకి తీసుకున్న విషయ తెలిసిందే. అందులో మొత్తం 12 మంది భారత సిబ్బంది ఉన్నారు. అయితే తాజాగా వారిలో తొమ్మిది మందిని ఇరాన్ దేశం విడుదల చేసినట్లు అధికారిక వర్గాల నుంచి సమాచారం. కాగా మరో ముగ్గురు ఇంకా వారి చెరలోనే ఉన్నారు. ఇటీవల అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరగడంతో ఇరాన్ పలు నావలను నిబంధనల ఉల్లంఘనల పేరిట అదపులోకి తీసుకుంది. దీంతో అనేక మంది భారతీయులు వారి అదుపులోకి వెళ్లారు. ఇటీవల అదుపులోకి తీసుకున్న బ్రిటన్ నౌక స్టెనా ఇంపెరోలో ఉన్న 18 మంది భారతీయులు సహా 21 మంది ప్రస్తుతానికి ఇరాన్ చెరలో ఉన్నారు.
అలాగే గ్రేస్1 నావలో ప్రయాణిస్తున్న 24 మంది భారత నావికులను జీబ్రాల్టర్ పోలీసు అథారిటీస్ అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. లండన్‌లోని భారత రాయబారులు వారిని బుధవారం కలిశారని విదేశాంగ శాఖ గురువారం ప్రకటించింది. వారిని విడుదల చేయించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..