కర్నాటక:25వ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన యడియూరప్ప

- July 26, 2019 , by Maagulf
కర్నాటక:25వ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన యడియూరప్ప

బెంగళూరు:కర్నాటక 25వ ముఖ్యమంత్రిగా బీజేపీ సీనియర్ నేత బీఎస్ యడియూరప్ప ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. సాయంత్రం 6:30 గంటలకు రాష్ట్ర గవర్నర్ వాజుభాయ్ వాలా ఆయనతో ప్రమాణం చేయించారు. బీజేపీ కార్యాలయం నుంచి భారీ ర్యాలీతో రాజ్‌భవన్‌కు చేరుకున్న ఆయన... పార్టీ కార్యకర్తల హర్షాతిరేకాల మధ్య ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి కర్నాటక మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ, బీజేపీ సీనియర్ నేతలు శోభా కరంద్లాజే, మురళీధర్ రావు సహా పలువురు నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com