గోవా వెళ్లే వాళ్ళ కోసం ఐఆర్‌సీటీసి ఆఫర్
- July 26, 2019
మూడు రోజులు గోవా టూర్. హ్యాపీగా ప్టైట్‌లో వెళ్లి రావొచ్చు. ధర కూడా అందుబాటులోనే. ఎప్పట్నించో విమానం ఎక్కాలన్న మీ కోరిక కూడా నెరవేరుతుంది. అదిరిపోయే ఆఫర్‌ని అందిస్తోంది ఐఆర్‌సీటీసి. టూరిజం సంస్ధ హైదరాబాద్-గోవా టూర్ ప్యాకేజ్‌ను ఆఫర్ చేస్తోంది. టూర్‌లో భాగంగా గోవాలో పేరున్న బీచ్‌లన్నీ చుట్టేయొచ్చు. హైదరాబాద్ వాసులు గోవా వెళ్లాలని భావిస్తే ఒక వ్యక్తికి రూ.12,625 చెల్లించాల్సి వస్తుంది. ఇండియన్ రైల్వేస్‌కి సంబంధించిన సంస్థే కాబట్టి ఎలాంటి భయాలు పెట్టుకోనవసరం లేదు. ఫ్లైట్‌లోనే వెళ్లి ఫ్టైట్‌లోనే తిరిగి రావచ్చు. సెప్టెంబర్ 8న ఉదయం 8:35 గంటలకు హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి టూర్ ప్రారంభమవుతుంది. ఇండిగో ఫ్లైట్ అరేంజ్ చేస్తుంది సంస్థ. ఇక ప్రయాణికులకు గోవాలోని పారడైజ్ విలేజ్ బీచ్ రిసార్ట్‌లో వసతి ఏర్పాటు చేసింది. ప్లైట్ టిక్కెట్ ధర, ట్రావెల్ ఇన్సూరెన్స్, బ్రేక్ ఫాస్ట్, డిన్నర్ వంటి ఖర్చులన్నీ సంస్థే చూసుకుంటుంది. కానీ లంచ్ మాత్రం మన డబ్బులతోనే చేయాలండోయ్. అదీ సంగతి.. మరి గోవా టూర్ కన్ఫామా!
తాజా వార్తలు
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!