అమర్‌నాథ్ రూట్లో ల్యాండ్‌మైన్లు.. యాత్రికులపై పాక్ టార్గెట్
- August 02, 2019
హైదరాబాద్: పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాదులు.. భారీ కుట్రకు ప్లానేశారు. కశ్మీర్‌లో జరుగుతున్న అమర్‌నాథ్ యాత్రకు అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. పాకిస్థాన్ ఆర్మీ సహాయంతో అక్కడి ఉగ్రవాదులు అమర్‌నాథ్ యాత్రికులను భయకంపితులకు గురిచేస్తున్నట్లు భారతీయ ఆర్మీ వెల్లడించింది. గత నాలుగైదు రోజుల నుంచి ఇంటెలిజెన్స్ సమాచారం అందుతోందని, పాక్ ఆర్మీ సాయంతో ఉగ్రవాదులు అమర్‌నాథ్ యాత్రను అడ్డుకుంటున్నట్లు తెలిసిందని, దీనిలో భాగంగా యాత్ర రూట్లో గాలింపులు చేపట్టామని చిన్నార్ కార్ప్స్ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ కేజీఎస్ థిల్లాన్ తెలిపారు. అయితే తమ గాలింపుల్లో పాక్‌కు చెందిన ల్యాండ్‌మైన్లు, పేలుడు పదార్ధాలను స్వాధీనం చేసుకున్నట్లు లెఫ్టినంట్ జనరల్ థిల్లాన్ చెప్పారు. ఐఈడీలు, నాటు బాంబులు అమర్‌నాథ్ రూట్లో దొరికినట్లు ఆర్మీ వర్గాలు చెప్పాయి. ఇంకా ఆ రూట్లో విస్తృతంగా గాలింపు జరుగుతున్నట్లు ఆర్మీ తెలిపింది. కశ్మీర్‌లో ఉన్న శాంతి పరిస్థితులను చెదరగొట్టేందుకు పాక్ ఆర్మీ ప్రయత్నిస్తోందని జనరల్ థిల్లాన్ ఆరోపించారు. ఇలాంటి వాటిని అడ్డుకుంటామన్నారు.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!