పేర్లు మార్చుకోనున్న ఇన్స్టాగ్రామ్, వాట్సాప్
- August 04, 2019
శాన్ఫ్రాన్సిస్కో: ఇన్‌స్ట్రాగామ్, వాట్సాప్‌ల పేర్లు రానున్న కాలంలో మారే అవకాశం ఉంది. దీనికి సంబంధించి వాటి మాతృసంస్థ, సోషల్‌మీడియా దిగ్గజం ఫేస్బుక్ కసరత్తులు చేస్తోంది. ఆండ్రాయిడ్, యాపిల్ స్టోర్లలో ఇన్స్టాగ్రామ్ పేరు 'ఇన్స్టాగ్రామ్ ఫ్రమ్ ఫేస్బుక్', వాట్సాప్ పేరు 'వాట్పాప్ ఫ్రమ్ ఫేస్బుక్'గా మారే అవకాశం కనిపిస్తోంది. మెసేజింగ్ అప్లికేషన్లను ఏకీకృతం (మెర్జ్) చేయడంతోపాటు పాటు, ఈ సేవలన్నీ ఫేస్బుక్ నుంచే వస్తున్నాయన్న విషయాన్ని వినియోగదారులు గుర్తించేలా ఈ మార్పులకు శ్రీకారం చుట్టామని ఫేస్బుక్ అధికార ప్రతినిధి వెల్లడించారు. ఈ విషయం తమ ఉద్యోగులకు ఇప్పటికే వివరించినట్లు తెలిపారు. ఇతర సోషల్‌మీడియా వేదికల నుంచి వస్తున్న గట్టి పోటీ మేరకే ఫేస్బుక్ ఈ నిర్ణయం తీసుకుంటోందని వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొది.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..