వైరల్ అవుతున్న 'చిరు' న్యూ లుక్
- August 04, 2019మెగాస్టార్ చిరంజీవి కొత్త లుక్లో ఉన్న ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలను చిరు కోడలు ఉపాసన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. ఆమె 'బీ పాజిటివ్' అనే హెల్త్ మ్యాగజైన్ నడుపుతున్న విషయం తెలిసిందే. ఈ మ్యాగజైన్ కవర్ పేజీ కోసం చిరు ఫొటోషూట్ చేయించారు. ఈ కొత్త లుక్లో చిరు అదిరిపోయారు.
చిరు ప్రస్తుతం 'సైరా నరసింహారెడ్డి'లో నటిస్తున్నారు. సురేందర్ రెడ్డి దర్శకుడు. నయనతార, తమన్నా, అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, జగపతిబాబు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ పతాకంపై రామ్ చరణ్ నిర్మిస్తున్నారు. ఇటీవల చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అక్టోబరు 2న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..