పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు
- August 05, 2019
కాపు రిజర్వేషన్ల అంశాన్ని.. జమ్మూ కశ్మీర్ సమస్యతో పోల్చుతూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జమ్మూ కశ్మీర్ వంటి క్లిష్టమైన సమస్యలకే పరిష్కారం కనుగొంటున్నప్పుడు ఏపీలో కాపు సమస్యను పరిష్కరించడం చాలా సులభమని అన్నారు. కాపుల రిజర్వేషన్‌ను జగన్ రాజకీయ కోణంలో చూస్తున్నారని విమర్శించారు. టీడీపీ ప్రభుత్వం ప్రారంభించిన పోలవరం, అమరావతిలకు పక్కన పెట్టినట్లే కాపు రిజరేషన్ అంశాన్ని పక్కన పెడుతున్నారని ఆరోపించారు.
అటు ఏపీకి ప్రత్యేక హోదాపై పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక హోదా అడిగిన వారే ఇప్పుడు దానికి తూట్లు పొడుస్తూ.. వ్యతిరేక పంథాలో అవలంభిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ప్రజల్లో ఉన్న భావోద్వేగం ఏపీ ప్రజల్లో లేదని అన్నారు. నాయకుల్లో ప్రజల్లో ఆవేదన ఉంటేనే హోదా సాధ్యమవుతుందని పేర్కొన్నారు పవన్.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..