ఆర్టికల్ 370 రద్దుపై స్పందించిన రాహుల్
- August 06, 2019
న్యూఢిల్లీ : జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న అధికరణ 370 రద్దుపై రాహుల్ ఎట్టకేలకు మౌనం వీడారు. కశ్మీర్ పునర్విభజన బిల్లుపై లోక్‌సభలో వాడివేడి చర్చ జరుగుతున్న క్రమంలో కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై సోషల్ మీడియా వేదికగా స్పందించారు. కేంద్ర ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడి.. జాతీయ భద్రతను సంక్షోభంలోకి నెట్టేసిందని మండిపడ్డారు. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులను నిర్భందించి... వారిని సంప్రదించకుండా నిర్ణయం తీసుకుని రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డారని విమర్శించారు. భారత దేశం భూములతో నిర్మితం కాలేదని, ప్రజలతో ఏర్పడిందని..ఈ రకంగా ఏకపక్ష నిర్ణయం తీసుకుని జమ్మూ కశ్మీర్‌ను ఏడిపించడం జాతీయ సమగ్రత అనిపించుకోదు అని ఉద్వేగపూరితంగా ట్వీట్ చేశారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..