ఖతారీ స్విమ్మర్కి గోల్డ్ మెడల్
- August 06, 2019
ఖతార్: ఖతార్ యంగ్ స్పోర్టింగ్ స్టార్స్ ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన ప్రతిభను చాటి చెబుతున్నారు. తాజాగా ఖతారీ స్విమ్మర్ తమీమ్ మొహమ్మద్, 14వ అరబ్ స్విమ్మింగ్ ఛాంపియన్ షిప్స్‌లో గోల్డ్ మెడల్ సాధించాడు. 50 మీటర్ల బటర్‌ఫ్లై పోటీల్లో ఈ విజయాన్ని సొంతం చేసుకున్నాడు తమీమ్ మొహమ్మద్. ఆగస్ట్ 7 వరకు ఈ పోటీలు మొరాకోలోని రబాత్‌లో కొనసాగుతాయి. ఖతారీ స్విమ్మర్స్ అబ్దుల్అజీజ్ అలి ఒబైది, ఫరెస్ అల్ సైది, 2019 స్విమ్మింగ్ వరల్డ్ కప్‌లో తమ ప్రస్థానాన్ని ముగించారు. టోక్యోలో ఈ పోటీలు జరిగాయి. కాగా, చైనాలోని జినాన్‌లో జరిగే రెండో రౌండ్ టోర్నమెంట్లో ఖతార్‌కి చెందిన అమ్మార్ అష్రాఫ్, కరిమ్ సలామా పోటీ పడనున్నారు. ఆగస్ట్ 8, 10 తేదీల్లో ఈ పోటీలు జరుగుతాయి. యూకుబ్ అల్ ఖులైఫి, యూసఫ్ అల్ ఖులైఫి మూడో రౌండ్లో సింగపూర్‌లో 15 నుంచి 17 వరకు జరిగే పోటీల్లో పాల్గొంటారు.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు