సాల్మియాలో ఆత్మహత్య చేసుకున్న ఇండియన్‌

- August 06, 2019 , by Maagulf
సాల్మియాలో ఆత్మహత్య చేసుకున్న ఇండియన్‌

కువైట్‌: భారతీయ వలసదారుడొకరు సాల్మియాలో తాను నివసిస్తున్న ఫ్లాట్‌లో ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. సెక్యూరిటీ ఫోర్సెస్‌ వెల్లడించిన వివరాల ప్రకారం, సంఘటన గురించిన సమాచారం అందుకోగానే పారామెడిక్స్‌ అక్కడికి చేరుకుని, బాధితుడికి సహాయం అందించేందుకు ప్రయత్నించాయని చెప్పారు. అయితే, అప్పటికే ఆ వ్యక్తి తనను తాను పొడుచుకోవడంతో తీవ్రంగా రక్తస్రావమై ప్రాణాలు కోల్పోయాడు. మృతదేహాన్ని ఫోరెన్సిక్‌ డిపార్ట్‌మెంట్‌కి అప్పగించి, కేసు విచారణ ప్రారంభించారు. మృతుడ్ని భారతీయ వలసదారుడిగా గుర్తించారు. అతని ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి వుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com