అసభ్యకరమైన వీడియో: బహ్రెయినీ నటి అరెస్ట్
- August 07, 2019
బహ్రెయిన్:సోషల్ మీడియాలో అసభ్యకరమైన ఫొటోల్ని పోస్ట్ చేస్తున్న బహ్రెయినీ నటిని అరెస్ట్ చేశారు. 31 ఏళ్ళ నిందితురాలిపై కేసు నమోదు చేయడం జరిగిందనీ, ఆగస్ట్ 14న క్రిమినల్ కోర్టులో ఈ కేసు విచారణకు వస్తుందని పబ్లిక్ ప్రాసిక్యూషన్ వెల్లడించింది. క్యాపిటల్ గవర్నరేట్ ప్రాసిక్యూషన్ డిప్యూటీ అటార్నీ జనరల్ అహ్మద్ అల్ అన్సారీ మాట్లాడుతూ, సోషల్ మీడియాలో ఇమ్మోరల్ యాక్ట్స్‌కి పాల్పడుతున్నందున ఆమెపై కేసులు నమోదయినట్లు చెప్పారు. పబ్లిసిటీ కోసమే ఆ పని చేసినట్లు నిందితురాలు పేర్కొందని వివరించారు అల్ అన్సారీ. కాగా, సోషల్ మీడియాలో ఇలాంటి అసభ్యకరమైన వీడియోలు, ఫొటోల్ని ఎవరూ ప్రచారం చేయకూడదనీ, తమ దృష్టికి అసభ్యకరమైన విషయాలు వస్తే, వెంటనే ఫిర్యాదు చేయాలని అల్ అన్సారీ పేర్కొన్నారు. అరెస్ట్ జరిగిన కాస్సేపటికే ఆమె సోషల్ మీడియా అకౌంట్ నుంచి తొలగించబడింది.
తాజా వార్తలు
- $29.6 బిలియన్లకు ఖతార్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం..!!
- జనవరి 1 నుండి అధికారిక ఛానెల్స్ ద్వారానే సాలరీ..!!
- ఈ క్రిస్మస్కు డబ్బు ఆదా చేయాలనుకుంటున్నారా?
- 7.57లక్షల మంది కార్మికులకు బ్యాంక్ అకౌంట్లు లేవు..!!
- కొత్త OMR 1 నోటు జారీ చేసిన CBO ..!!
- అల్ అరీన్ రిజర్వ్ కు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ పేరు..!!
- ఫోర్బ్స్ అత్యంత సంపన్న దేశాలలో ఖతార్..!!
- ISB ప్లాటినం జూబ్లీ ఫెస్టివల్..టిక్కెట్లు విడుదల..!!
- ఒమన్ లో వాహనదారులకు కీలక సూచనలు..!!
- రియాద్ విమానాశ్రయంలో విమానాల ఆలస్యంపై సమీక్ష..!!







