దుబాయ్ ఎయిర్‌పోర్ట్ రోడ్లపై పెరిగిన ట్రాఫిక్
- August 08, 2019
దుబాయ్:గురువారం ఉదయం నుంచే యూఈ రోడ్లపై ట్రాఫిక్ విపరీతంగా పెరిగింది. ప్రధానంగా దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కి దగ్గర్లో రహదారులన్నీ కిక్కిరిసిపోయాయి. ఈ నేపథ్యంలో ప్రయాణం ఆలస్యమవుతోంది. ఈద్ అల్ అదా సెలవుల నేపథ్యంలో ఎయిర్‌పోర్ట్‌కి ప్రయాణీకుల తాకిడి ఎక్కువగా వుంటుందని ముందే ఊహించిన ట్రాఫిక్ విభాగం తగిన చర్యలు చేపట్టింది. ఆగస్ట్ 10 నుంచి ఆగస్ట్ 13 వరకు పబ్లిక్ మరియు ప్రైవేట్ సెక్టార్లకు సెలవు కావడంతో, సెలవుల్ని సద్వినియోగం చేసుకునేందుకు వివిధ ప్రాంతాలకు వెళుతున్నారు జనం. ఈ నేపథ్యంలో ఎయిర్‌పోర్ట్‌లో సందడి వాతావరణం నెలకొంది. మరోపక్క, విమాన ప్రయాణీకులు ముందస్తుగానే విమానాశ్రయానికి చేరుకోవాలని ఆయా విమానయాన సంస్థలు సూచనలు జారీ చేశాయి. ఆగస్ట్ 8 సాయంత్రం నుంచి మరింతగా ఎయిర్‌పోర్ట్ పరిసరాల్లోని రోడ్లపై ట్రాఫిక్ పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు