సుష్మా స్వరాజ్ మృతిపై బుక్ ఆఫ్ కండోలెన్స్ ప్రారంభించనున్న ఇండియన్ ఎంబసీ
- August 08, 2019
మస్కట్: ఒమన్లోని ఇండియన్ ఎంబసీ, బుక్ ఆఫ్ కండోలెన్స్ని ప్రారంభించనున్నట్లు వెల్లడించింది. భారత మాజీ కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ మృతి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. గుండె పోటుతో ఇటీవల సుష్మా స్వరాజ్ మృతి చెందిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో, ఇండియన్ ఎంబసీ ఫేస్ బుక్ ద్వారా 'బుక్ ఆఫ్ కండోలెన్స్' వివరాల్ని వెల్లడించడం జరిగింది. సుష్మా స్వరాజ్ గొప్ప మానవతా వాది అనీ, ఆమె దేశానికి అందించిన సేవలు చాలా గొప్పవనీ, విదేశాలకు చెందినవారూ ఆమెను గౌరవిస్తారనీ ఇండియన్ ఎంబసీ పేర్కొంది. ఇండియన్ ఎంబసీలోని డిప్లమాటిక్ ఏరియాలో ఆగస్ట్ 7, 8 మరియు 11వ తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బుక్ ఆఫ్ కండోలెన్స్ని ఓపెన్ చేస్తారు.
తాజా వార్తలు
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!







