పాక్ నుంచి వచ్చేస్తున్న ఇండియన్ హై కమిషనర్

- August 08, 2019 , by Maagulf
పాక్ నుంచి వచ్చేస్తున్న ఇండియన్ హై కమిషనర్

న్యూఢిల్లీ:జమ్మూ-కశ్మీరుకు ప్రత్యేక అధికారాలు కల్పిస్తున్న భారత రాజ్యాంగంలోని అధికరణ 370 రద్దు, ఆ రాష్ట్ర విభజన నిర్ణయాలను పాకిస్థాన్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇరు దేశాల మధ్య వాణిజ్యాన్ని నిలిపేయడం, దౌత్య సంబంధాల కుదింపు, ఇండియన్ హై కమిషనర్‌ను వెనుకకు పంపడం, సమ్‌ఝౌతా ఎక్స్‌ప్రెస్ రైలు సర్వీసు నిలిపివేత వంటి చర్యలతో అగ్గి మీద గుగ్గిలమవుతోంది. మరోవైపు పాకిస్థాన్ స్వాతంత్ర్య దినోత్సవాలు జరిగే ఆగస్టు 14న కశ్మీరీలకు సంఘీభావంగా జరపాలని, భారతదేశ స్వాతంత్ర్య దినోత్సవాలు జరిగే ఆగస్టు 15న బ్లాక్ డే నిర్వహించాలని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం నిర్ణయించింది.

ఈ నేపథ్యంలో ఇండియన్ హై కమిషనర్‌ను తిరిగి భారత్ వెళ్ళిపోవాలని పాకిస్థాన్ కోరింది. దీంతో పాకిస్థాన్‌లోని ఇండియన్ హై కమిషనర్ అజయ్ బిసరియా తిరిగి భారత దేశానికి వచ్చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.

పాకిస్థాన్ వైఖరిపై భారతదేశం స్పందిస్తూ దౌత్య సంబంధాల కుదింపు నిర్ణయంపై పునరాలోచించాలని కోరింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com