పాక్ నుంచి వచ్చేస్తున్న ఇండియన్ హై కమిషనర్
- August 08, 2019
న్యూఢిల్లీ:జమ్మూ-కశ్మీరుకు ప్రత్యేక అధికారాలు కల్పిస్తున్న భారత రాజ్యాంగంలోని అధికరణ 370 రద్దు, ఆ రాష్ట్ర విభజన నిర్ణయాలను పాకిస్థాన్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇరు దేశాల మధ్య వాణిజ్యాన్ని నిలిపేయడం, దౌత్య సంబంధాల కుదింపు, ఇండియన్ హై కమిషనర్‌ను వెనుకకు పంపడం, సమ్ఝౌతా ఎక్స్‌ప్రెస్ రైలు సర్వీసు నిలిపివేత వంటి చర్యలతో అగ్గి మీద గుగ్గిలమవుతోంది. మరోవైపు పాకిస్థాన్ స్వాతంత్ర్య దినోత్సవాలు జరిగే ఆగస్టు 14న కశ్మీరీలకు సంఘీభావంగా జరపాలని, భారతదేశ స్వాతంత్ర్య దినోత్సవాలు జరిగే ఆగస్టు 15న బ్లాక్ డే నిర్వహించాలని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ నేపథ్యంలో ఇండియన్ హై కమిషనర్‌ను తిరిగి భారత్ వెళ్ళిపోవాలని పాకిస్థాన్ కోరింది. దీంతో పాకిస్థాన్‌లోని ఇండియన్ హై కమిషనర్ అజయ్ బిసరియా తిరిగి భారత దేశానికి వచ్చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.
పాకిస్థాన్ వైఖరిపై భారతదేశం స్పందిస్తూ దౌత్య సంబంధాల కుదింపు నిర్ణయంపై పునరాలోచించాలని కోరింది.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!