తెలంగాణ:అన్ని జిల్లాలకు 108 బైక్ అంబులెన్స్
- August 09, 2019
తెలంగాణ:రోడ్డు ప్రమాదాలకు గురైనవారు సత్వర చికిత్స అందక ప్రాణాలు పోగొట్టుకున్నారు. ప్రమాదాలు జరిగినవారికి వెంటనే చికిత్స అందుబాటుకొస్తే ప్రాణాలు కాపాడవచ్చు. ప్రాణాపాయంలో ఉన్నవారి కోసం ఇప్పటికే అంబులెన్స్ సేవలు అందిస్తున్నాయి. కానీ తీసుకెళుతున్న క్రమంలో ట్రాఫిక్ ఇబ్బందుల వల్ల కావచ్చు..మరేదైనా కారణాల వల్ల కావచ్చు..సకాలంలో ఆస్పత్రులకు చేరుకోని సందర్భాలు..బాధితులు ఉన్న ప్రాంతాలకు చేరుకోని ప్రాంతాలు రాష్ట్రంలో చాలా ఉన్నాయి. ఈ క్రమంలో 4 వీలర్ అంబులెన్స్ లు వెళ్లలేని ప్రాంతాలలకు..కూడా టూవీలర్ అంబులెన్స్ లు సులభంగా చేరగలవు..ఈ ఆలోచనతోనే తెలంగాణ ప్రభుత్వం బైక్ అంబులెన్స్ లను అందుబాటులోకి తీసుకొచ్చింది.
రోడ్డు ప్రమాదంలో గాయపడినవారికి ఎమర్జన్సీ ట్రీట్ మెంట్ అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఫస్ట్ రెస్పాండర్ల (108 బైక్ అంబులెన్సు)ను అందుబాటులోకి తెచ్చింది. అంబులెన్సులు వెళ్లలేని ప్రాంతాలల్లోకి..ఇరుకు రూట్లలోకి వెళ్లి ఎమర్జన్సీ సర్వీస్ అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం, జీవీకే ఈఎంఆర్ఐ సంయుక్తంగా దేశంలోనే తొలిసారిగా బైక్ అంబులెన్సులను ప్రవేశపెట్టింది.
రాష్ట్రవ్యాప్తంగా మొదటివిడతగా 50 బైక్ అంబులెన్స్ లను ఏర్పాటు చేసింది. ఇవి మొదటిసారి హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాల్లో ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. మంచి ఫలితాలు రావటంతో అన్ని జిల్లాలకు ఈ వాహనాలకు అందుబాటులోకి తీసుకొచ్చింది ప్రభుత్వం. ఐటీడీఏ పరిధిలలో 10 వాహనాలను ఉంచేలా చర్యలు తీసుకుంది. ఈ బైక్ అంబులెన్స్ ద్వారా మంచి వైద్యసేవలు అందుతుండటంతో భవిష్యత్తులో వీటి సంఖ్య మరింతగా పెంచాలని ప్రభుత్వం యోచిస్తోంది.
ప్రమాదం జరిగిన చోటుకు చేరుకుని ప్రాథమిక చికిత్సతో పాటు వారికి అవసరమైన మెడిసిన్స్, దానికి సంబంధించిన వైద్య పరికరాలను బైకు వెనుక అమర్చిన బాక్సలో వైద్య సిబ్బంది సిద్ధంగా ఉంచుకుంటారు. రోడ్డు ప్రమాదాలు, పాముకాటు, ఫైర్ యాక్సిడెంట్, హార్ట్ ఎటాక్, పెరాలసిస్, బీపీ, షుగర్, లేదా ఆత్మహత్యాయత్నం చేసుకున్న సందర్భాలు, ఎండల్లో వడదెబ్బ,పాముకాటు, గర్భిణులకు అత్యవసర సేవల్ని ఈ 108 బైక్ అంబులెన్స్ సిబ్బంది అందిస్తున్నారు. ఈ బైక్ అంబులెన్సుపై ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్(ఈఎంటీ) అందుబాటులో ఉంటారు. ఈ వాహనంలోనే ఆక్సిజన్ సిలిండర్‌తోపాటు బీపీ, షుగర్, ఫీవర్ వంటి అన్నింటికీ అనారోగ్య సమస్యలకు సంబంధించిన అన్ని పరికరాలు, నెబులైజర్, ఇంజక్షన్లు, టానిక్‌లు, ట్యాబ్లెట్లు అన్నీ ఈ 108 అంబులెన్స్ లో సిద్ధంగా ఉంటాయి.
తాజా వార్తలు
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!