అరుణ్ జైట్లీ ఆరోగ్యంపై ఎయిమ్స్ పత్రికా ప్రకటన
- August 10, 2019
కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ ఆరోగ్యం ప్రస్తుతం బాగానే ఉందని ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు ప్రకటించారు. అరుణ్ జైట్లీ శ్వాసకోశ సంబంధిత సమస్యతో ఎయిమ్స్ ఆస్పత్రిలో చేరారు. దీనికి సంబంధించి వైద్యులు ప్రకటన విడుదల చేశారు. 'అరుణ్ జైట్లీ ఈ రోజు ఉదయం ఎయిమ్స్ ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయనకు ఐసీయూలో చికిత్స కొనసాగుతోంది. వివిధ రంగాల నిపుణులైన వైద్యుల బృందం అరుణ్ జైట్లీ చికిత్సను పర్యవేక్షిస్తోంది. ప్రస్తుతం ఆయన అరోగ్యం బాగానే ఉంది.' అని ఎయిమ్స్ ప్రకటనలో తెలిపింది. ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న అరుణ్ జైట్లీని ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, స్పీకర్ ఓంబిర్లా తదితరులు పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి జైట్లీ ఆరోగ్య పరిస్థితిపై వివరాలు తెలుసుకున్నారు.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు