కేరళ వరదలు: ఒమన్ పౌరులకు హెచ్చరిక
- August 10, 2019
మస్కట్: ఇండియాలోని ఒమన్ ఎంబసీ, తమ పౌరులకు కేరళ వరదల విషయమై స్పష్టమైన హెచ్చరికలు జారీ చేసింది. కేరళలో వరద ప్రమాద తీవ్రత ఎక్కువగా వున్నందున, ఆ రాష్ట్రానికి వెళ్ళినవారు అప్రమత్తంగా వుండాలనీ, వెళ్ళాలనుకునేవారే తమ ప్రయాణాల్ని వాయిదా వేసుకోవడం మంచిదని హెచ్చరించారు అధికారులు. ప్రమాదక పరిస్థితుల్లో ఎవరైనా చిక్కుకుపోయి వుంటే, ఢిల్లీలోని సుల్తానేట్ ఎంబసీని ఫోన్ ద్వారా సంప్రదించాలని అధికారులు సూచించారు. ముంబైలోని ఎంబసీ కార్యాలయాన్ని కూడా సంప్రదించవచ్చునని అధికారులు తమ పౌరులకు తెలిపారు. కాగా, కోచి ఎయిర్ పోర్ట్ వరదల కారణంగా మూసివేయడంతో అక్కడికి టిక్కెట్లు బుక్ చేసుకున్న ప్రయాణీకులు ఇబ్బందులు పడుతున్నారు.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు