రాఫెల్ లో 1 మిలియన్ దిర్హామ్‌లు గెల్చుకున్న కేరళ వలస డ్రైవర్
- August 10, 2019
అబుదాబీలో వుంటోన్న కేరళ వలసదారుడు 1 మిలియన్ దిర్హామ్‌లను గెల్చుకున్నాడు. దుబాయ్‌లోని ఓ మాల్ నిర్వహించిన కాంటెస్ట్‌లో ఈ బహుమతి ఆయన్ని వరించింది. 43 ఏళ్ళ షానవాస్ ఈ బహుమతిని గెల్చుకున్న అనంతరం పట్టలేని ఆనందంతో ఉప్పొంగిపోయాడు. తాను యాభయ్యేళ్ళు పనిచేసినా ఇంత మొత్తం సంపాదించేవాడిని కాదేమోనని చెప్పాడాయన. 1997లో పొట్ట చేత పట్టుకుని అబుదాబీ వచ్చాననీ, డ్రైవింగ్ లైసెన్స్ పొంది డ్రైవర్‌గా జీవనోపాధి పొందుతున్నానని అన్నాడు. ప్రస్తుతం 2,500 దిర్హామ్‌ల సంపాదన తనకు లభిస్తోందని చెప్పాడు షానవాస్. మాల్ మిలియనీర్ క్యాంపెయిన్‌లో భాగంగా ఈ లక్కీ ఛాన్స్ షానవాస్కి దక్కింది.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు