యెమెన్‌లోని అడెన్‌లో భీకరపోరు...40 మంది మృతి
- August 12, 2019
యెమెన్‌లోని అడెన్‌లో ప్రభుత్వ అనుకూల దళాలకు, వేర్పాటు వాదులకు మధ్య జరిగిన భీకరపోరులో కనీసం 40 మంది మరణించారని, మరో 260 మందికి పైగా గాయపడ్డారని ఐరాస వెల్లడించింది. ఈ నెల 8వ తేదీ నుండి అడెన్ నగరంలో కొనసాగుతున్న పోరులో అనేక మంది పౌరులు ప్రాణాలుకోల్పోగా, పలువురు గాయాల పాలయ్యారని వివరించింది. ఇందుకు సంబంధించి తమకు అందిన ప్రాథమిక నివేదిక ప్రకారం ఈ మూడు రోజుల్లో దాదాపు 40 మంది వరకూ మరణించారని, మరో 260 మంది గాయపడ్డారని ఐరాస తన ప్రకటనలో వివరించింది. శాంతి, సామరస్యాలు వెల్లివిరిసే ఈద్ఉల్ అధా పండుగ రోజు ఆత్మీయుల మరణానికి విచారాన్ని తెలియచేయాల్సి రావటం అత్యంత విచారకరమైన అంశమని యెమెన్‌లోని ఐరాస కార్యక్రమాల సమన్వయ కర్త లిసె గ్రాండె ఆవేదన వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు అవసరమైన వైద్య సహాయం అందించేందుకు వైద్య బృందాలను పంపటం తమ ముందున్న తక్షణ ప్రాధాన్యత అని ఆమె వివరించారు. పలువురు ప్రజలు తమ ఇళ్లలోనే చిక్కుకుపోయి ఆహారం, నీటి కొరతను ఎదుర్కొంటున్నట్లు వెలువడుతున్న వార్తలు తమను తీవ్ర కలవరపాటుకు గురి చేస్తున్నాయని ఆమె చెప్పారు.
తాజా వార్తలు
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!