'సైమా అవార్డ్స్ 2019': తెలుగు ఉత్తమ నటుడు,ఉత్తమ నటి వివరాలు
- August 16, 2019ఖతర్:సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (సైమా) వేడుక ఖతార్ లోని దోహా లో నిన్న గ్రాండ్ గా ప్రారంభమైంది. రెండు రోజులపాటు జరుగన్న ఈ వేడుకకు తెలుగు , తమిళ , మలయాళ , కన్నడ భాషలకు చెందిన ప్రముఖులు హాజరైయ్యారు. కాగా టాలీవుడ్ నుండి మెగాస్టార్ చిరంజీవి ఈ మెగా ఈవెంట్ కు ముఖ్య అతిధిగా హాజరైయ్యారు.
ఇక సైమా తెలుగు ఉత్తమ నటుడు విభాగంలో రంగస్థలం సినిమా కు గాను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సైమా అవార్డును గెలుచుకున్నాడు. అయితే ఆర్ఆర్ఆర్ షూటింగ్ లో చరణ్ బిజీ గా ఉండడంతో ఆయన తరుపున చిరంజీవి ఆ అవార్డును తీసుకున్నారు. కాగా ఇటీవల ప్రకటించిన జాతీయ అవార్డుల్లో చరణ్ కు ఉత్తమ నటుడు అవార్డు దక్కకపోవడంతో నిరాశ చెందిన మెగా ఫ్యాన్స్ కు తాజా అవార్డు ఊరటనిచ్చింది.
తెలుగు ఉత్తమ నటి విభాగంలో మహానటి సినిమాకు గాను కీర్తి సురేష్ అవార్డును గెలుచుకుంది. ఇటీవల కేంద్రం ప్రకటించిన జాతీయ అవార్డుల్లో ఉత్తమ జాతీయ నటి గా అవార్డు గెలుచుకొని అందరి ప్రశంసలు అందుకున్న కీర్తి .. తాజాగా సైమా రూపంలో మరో ప్రతిష్టాత్మక అవార్డును ఖాతాలో వేసుకుంది. ఇక ఉత్తమ కన్నడ నటుడుగా యష్ సైమా అవార్డును గెలుచుకున్నాడు. కెజిఎఫ్ చిత్రానికి కి గాను యష్ కు అవార్డు వరించింది.
సైమా 2019 విజేతలు (తెలుగు):
ఉత్తమ నటుడు - రామ్ చరణ్ (రంగస్థలం )
ఉత్తమ నటి - కీర్తి సురేష్ (మహానటి)
ఉత్తమ నటుడు (క్రిటిక్స్) - విజయ్ దేవరకొండ (గీత గోవిందం )
సోషల్ మీడియా సూపర్ స్టార్ - విజయ్ దేవరకొండ
ఉత్తమ సంగీత దర్శకుడు - దేవి శ్రీ ప్రసాద్ ( రంగస్థలం )
(గమనిక : ఇది సైమా అవార్డ్స్ విజేతల పూర్తి లిస్ట్ కాదు .. )
-- రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతర్)
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ