అమరావతి లో పెట్టుబడులపై వారితో చర్చించనున్న ముఖ్యమంత్రి జగన్
- August 17, 2019
అమరావతి:ఏపీ సీఎం జగన్ ఆరు రోజుల పర్యటనలో భాగంగా అమెరికా చేరుకున్నారు. వాషింగ్టన్ డీసీలో భారత ఎంబసీ సీనియర్ అధికారులు జగన్‌ను సాదరంగా ఆహ్వానించారు. అలాగే ఎయిర్‌పోర్టులో ప్రవాసాంధ్రులు కూడా ఏపీ సీఎంకు ఘనస్వాగతం పలికారు. పర్యటనలో భాగంగా అమెరికా- ఇండియా బిజినెస్ కౌన్సిల్ ప్రతినిధులతో జగన్ భేటీ అవుతారు. ఏపీలో పెట్టుబడులపై వారితో చర్చిస్తారు. అనంతరం భారత రాయబారి ఆహ్వానం మేరకు విందులో పాల్గొంటారు.
సీఎం జగన్ రేపు డల్లాస్ పర్యటనకు వెళ్లనున్నారు. అక్కడ సాయంత్రం నార్త్ అమెరికాలోని తెలుగు వాళ్లను కలుసుకుని వారినుద్దేశించి ప్రసంగిస్తారు. 18న వాషింగ్టన్ డీసీలో మరికొందరు వ్యాపార సంస్థల ప్రతినిధులతో సీఎం జగన్ ముఖాముఖి చర్చలు జరుపుతారు. ఆగస్టు 22న షికాగోలో మరికొందరు ప్రతినిధులతో భేటీ ఏపీలో పెట్టుబడులకు ఉన్న వనరులు, అవకాశాలపై వివరించనున్నట్టు తెలుస్తుంది. అనంతరం ఆయన ఏపీకి తిరిగిరానున్నారు.
తాజా వార్తలు
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







