వాట్స్ యాప్ లో నాలుగు సరికొత్త ఫీచర్లు
- August 19, 2019
సాధారణ మెసేజ్ లతో పాటు ఫోటోలు, వీడియో, ఆడియో క్లిప్పింగ్ లను స్నేహితులు, బంధుమిత్రులతో క్షణాల్లో పంచుకునేందుకు సహకరించే వాట్స్ యాప్, ఇప్పుడు మరో నాలుగు కొత్త ఫీచర్లను దగ్గర చేయనుంది. వాటిల్లో అతి ముఖ్యమైనది, ఎవరైనా క్రియేట్ చేసిన గ్రూపుల్లో ఒకరి అనుమతి లేకుండా చేర్చడం ఇకపై జరగబోదు. ఎవరో క్రియేట్ చేసే గ్రూపులో తమంతట తామే చేరిపోతున్నామని, తమకు ఇష్టం లేకుండానే ఇది జరిగిపోతోందని పలువురు ఫిర్యాదులు చేయడంతో.. వాట్స్ యాప్ ఈ నిర్ణయం తీసుకుంది. ఇకపై ఎవరైనా, ఎవరినైనా ఏదైనా గ్రూప్ లో చేరిస్తే, 72 గంటల్లోగా దాన్ని చూసి, యాక్సెప్ట్ లేదా రిజెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇదే సమయంలో కస్టమర్ తన నంబర్ ను గ్రూప్స్ లో యాడ్ చేయవద్దు అనే ఆప్షన్ ను కూడా వాట్స్ యాప్ అందుబాటులోకి తెచ్చింది. తిరిగి ఆ ఆప్షన్ ను అన్ లాక్ చేసేంత వరకూ మరే గ్రూప్ లోనూ కస్టమర్ యాడ్ కాడు. ఇక ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉన్న స్మార్ట్ ఫోన్లలో వేలిముద్ర సాయంతో అన్ లాక్ చేసుకునే సదుపాయాన్ని, స్పామ్ మెసేజ్ లను సులువుగా గుర్తించేందుకు 'ఫ్రీక్వెంట్లీ ఫార్వర్డెడ్' పేరిట సరికొత్త ఫీచర్ ను కూడా వాట్స్ యాప్ ప్రారంభించింది. వరుసగా వచ్చే వాయిస్ మెసేజ్ లను ఒకదాని తరువాత ఒకటి వినేందుకు వీలుగా మరో సరికొత్త ఫీచర్ ను తయారు చేస్తున్నట్టు కూడా వాట్స్ యాప్ పేర్కొంది.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!