ఐఎస్ఐ అలజడులు.. ఐబి హెచ్చరికలు..ఈ మూడు రాష్ట్రాలను జల్లెడపడుతున్న పోలీసులు
- August 20, 2019
ఆర్టికల్ 370 రద్దు తరువాత జమ్మూ కాశ్మీర్లో భద్రతను మరింత పెంచిన సంగతి తెలిసిందే. జమ్మూ కాశ్మీర్లోకి ఉగ్రవాదులు ప్రవేశించకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. దీంతో ఉగ్రవాదులు రూటు మార్చి రాజస్తాన్, గుజరాత్, మహారాష్ట్ర గుండా దేశంలోకి ప్రవేశించే అవకాశం ఉందని ఐబి సమాచారం అందించింది. ఐబి అందించిన సమాచారంతో దేశవ్యాప్తంగా హైఅలర్ట్ ను ప్రకటించారు. ఈ మూడు రాష్ట్రాలను పోలీసులు జల్లెడపడుతున్నాయి.
దేశంలోకి నాలుగు ఐఎస్ఐ తీవ్రవాదులు ప్రవేశించారని సమాచారం అందటంతో.. హోటళ్లు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు సహా రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టాలని పోలీసులకు కేంద్రం ఆదేశించింది. కీలకమైన ప్రాంతాల్లో నిఘా పెంచాలని, అనుమానితులను ప్రశ్నించాలని, వాహనాలను తనిఖీ చేయాలని కేంద్రం సూచించింది.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!