భారత్ తో ఇక చర్చలకు తావులేదు అంటూ అసహనం వ్యక్తం చేసిన ఇమ్రాన్
- August 22, 2019
న్యూఢిల్లీ: పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ న్యూయార్క్ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతు భారత్‌తో చర్చలకు ఎట్టి పరిస్థితుల్లో అవకాశం లేదని అసహనంతో ఈ వ్యాఖ్యలు చేశారు. తాను శాంతి గురించి చర్చలు జరిపేందుకు ప్రయత్నించిన ప్రతిసారి భారత్ కేవలం బుజ్జగింపులాగానే భావిస్తోందని ఇంతకు మించి తాము ఏమీ చేయలేమని చెప్పారు. అణ్వాస్త్ర బలం ఉన్న తమ ఇరు దేశాల మధ్యా రోజురోజుకూ పెరుగుతున్న యుద్ధ వాతావరణంపై ఆందోళన చెందుతున్నట్లు ఇమ్రాన్ తెలిపారు. ఆర్టికల్ 370 రద్దుపై స్పందిస్తూ.. ఈ విషయంలో ఇండియాతో తాడోపేడో తేల్చుకుంటామని అంతర్జాతీయ న్యాయస్థానంతో పాటు ఐక్యరాజ్య సమితి దృష్టికి తీసుకెళ్లి మరింత బలంగా తమ వాదన వినిపిస్తామని ఇమ్రాన్ ఖాన్ స్పష్టం చేశారు. కాగా భారత ప్రధాని మోదీ చర్చలకు ఆహ్వానించిన ప్రతీ సందర్భంలో తమ సైన్యాన్ని దెబ్బ తీస్తున్నారని ట్రంప్‌తో ఇమ్రాన్ చెప్పినట్లు తెలిసింది.
తాజా వార్తలు
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!